పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద పరిస్థితిని ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. పాత పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బండ్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పాత పోలవరం, కమ్మరగూడెం, నూతనగూడెం, యడ్లగూడెం, బంగారమ్మపేట, కృష్ణాపురం గ్రామస్థులు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. వరద ప్రవాహం పెరగకుండా ఇసుక బస్తాలు సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి:
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు