పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన మైనర్‌ను వివాహం చేసుకున్నందున పోలీసులు కోడి సాయికృష్ణ అనే యువకుడిని రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమించిన యువకుడు తన స్నేహితుల సహకారంతో చింతలూరి దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు సహా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండి
ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!