మంత్రి తానేటి వనిత కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం అదుపుతప్పగా.. ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు ఎస్కార్ట్ వాహనం తప్పించబోయి డివైడర్ పైకి దూసుకెళ్లింది. భీమవరం ప్రాంతానికి చెందిన 70ఏళ్ల కలసూరి వెంకటరామయ్య ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందాడు. మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం దెబ్బతింది. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: