పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆవిష్కరించారు. అనంతరం వస్త్ర దానం నిర్వహించిన ఆయన...ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్ను దేవుడుతో సమానంగా పూజిస్తారన్నారు. ప్రతి ఇంట్లోనూ కాటన్ ఫొటో పెట్టుకుని అందరూ ఆరాధిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీచదవండి తిరుపతిలో రామతీర్థం విగ్రహం తయారీ