ETV Bharat / state

టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోంది: మంత్రి బొత్స

తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు తెలుగుదేశం సానుభూతిపరులేనని ఆరోపించారు.

Minister Botsa react on Tanuku Issue
Minister Botsa react on Tanuku Issue
author img

By

Published : Mar 17, 2022, 9:13 PM IST

తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. లబ్ధిదారులు తెలుగుదేశం సానుభూతిపరులేనని ఆరోపించిన బొత్స.... దీనిపై తణుకు ఎమ్మెల్యేతో మాట్లాడానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఓ విధానం లేకుండా ఆరోపణలు చేస్తోందని బొత్స అన్నారు.

ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తలేక ఒకే అంశంపై శాసనసభ, మండలిని నిలుపుదల చేస్తోందని విమర్శించారు. బడ్జెట్​పై చర్చలు జరిగే సమయంలో అడ్డుకుంటున్నారనే... వారిపై సస్పెన్షన్ వేటు పడిందని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: 'టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎమ్మెల్యే కారుమూరిని అరెస్టు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.