ETV Bharat / state

నాటుసారా మృతులపై మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యలు.. ఖండించిన కుటుంబసభ్యులు

Alla Nani Comments Natu Saara Deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసాారా తాగి పలువురు మరణించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహమ్మారి వల్ల కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలుకాగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Alla Nani Comments
నాటుసారా మృతులపై మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యలు
author img

By

Published : Mar 13, 2022, 6:00 PM IST

Alla Nani Comments Natu Saara Deaths: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి పలువురు మరణించిన ఘటనపై మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతి చెందిన వారు తాగుబోతులని నిందవేయడాన్ని మృతుల కుటుంబసభ్యులు ఖండించారు.

నాటుసారా మృతులపై మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యలు

ఆహారం, నీరు మానేసి మద్యం సేవించడం వల్లే మృతి చెందారని మంత్రి చెప్పిన మాటలు అబద్ధమని మృతుడు అనిల్‌కుమార్ సోదరి అన్నారు. తన తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, కల్తీ సారా తాగటం వల్లే మరణించాడని ఆమె చెప్పారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా వల్లే చాలా మంది చనిపోయారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. నాటుసారా తాగి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారు: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.