జర్నలిస్టుల కోర్కెల దినోత్సవ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియా ప్రతినిధులు.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. కరోనా పరిస్థితుల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
కరోనా విపత్కర పరిస్థితులలో పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖలతోపాటు తాము కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామన్నారు. తమను కూడా కరోనా వారియర్స్ గా గుర్తించాలని కోరారు. వైద్య ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. తణుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: