ETV Bharat / state

రైలుపై దూకి వ్యక్తి ఆత్మహత్య - atma hatya

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తిరుమల ఎక్స్​ప్రెస్​ మీదకు దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్​ తీగల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించాడు.

తిరుమల ఎక్స్​ప్రెస్​ మీదకు దూకి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Aug 3, 2019, 4:04 PM IST

తిరుమల ఎక్స్​ప్రెస్​ మీదకు దూకి వ్యక్తి ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైలు ఇంజన్​పై దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న తిరుమల ఎక్స్​ప్రెస్​ ఇంజన్​ మీదకు గుర్తు తెలియని వ్యక్తి అమాంతంగా దూకాడు. దీనితో విద్యుత్​ సరఫరా చేసే తీగల్లో చిక్కుకుపోయాడు. వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీగల మధ్యలో వ్యక్తి చిక్కుకున్న కారణంగా... రైలు ఇంజన్​కు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం గ్రహించిన లోకో పైలట్ విద్యుత్ తీగల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

'బహిరంగ మూత్రవిసర్జన చేసేవారికి అడ్డుకట్ట'

Intro:AP_TPG_06_03_BHARI_GUTKA_PATTIVETHA_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని లక్షలు విలువ చేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు

Body:పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బుద్దు అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రం అంబి అనే గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కం టైలర్ లారీని ఆపి 30 ఖైని ప్యాకెట్లు బస్తాలు ఉన్నాయని .. ఏలూరు వరకు తీసుకు వస్తే ఐదు వేల రూపాయలు ఇస్తానని కిరాయి మాట్లాడుతున్నాడు. అనుకున్న ప్రకారం కంటైనర్ డ్రైవర్ తీసుకొని ఖైని ప్యాకెట్ల బస్తాలను ఏలూరు తీసుకొచ్చాడు. ముఠాలో మరొక నిందితులైన ఆటో డ్రైవర్ కు బుద్దు ఫోన్ చేశాడు. ఏలూరు శివారులోని జే ఎన్ జే స్కూల్ వద్ద కైనీ ప్యాకెట్లు లోడ్ చేస్తుండగా రూరల్ పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు గుట్టలు గుట్టలుగా లభ్యమయ్యాయి. గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న బుద్దు అనే వ్యక్తి పరారయ్యాడు. కంటైనర్ డ్రైవర్ చంద్ర కిషోర్ సింగ్, ఆటో డ్రైవర్ పచ్చి రెడ్డి శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సి ఐ బాలరాజాజి , ఎస్సై కిషోర్ బాబు డి.ఎస్.పి అభినందించారు.

Conclusion:బైట్. దిలీప్ కుమార్ , ఏలూరు డి ఎస్ పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.