ETV Bharat / state

శైవాలయాల్లో శివరాత్రి శోభ.. పోటెత్తిన భక్తులు - శివరాత్రి 2021వేడుకలు

మహా శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

maha sivarathri at west godavari district
శైవాలయాల్లో శివరాత్రి శోభ
author img

By

Published : Mar 11, 2021, 3:20 PM IST

మహా శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమేశ్వర జనార్థన స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

క్షీరారామ లింగేశ్వర స్వామి దర్శనం..

పాలకొల్లు క్షీరారామ లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు సేవలు అందిస్తున్నారు.

స్పటిక లింగ దర్శనం..

తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ దంపతులు స్పటిక లింగానికి 12 నదీజలాలతో అభిషేకాలు నిర్వహించారు.

బారులు తీరిన భక్తులు..

ఆచంట రామేశ్వర స్వామి క్షేత్రంలో వేకువజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, పూజలు ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

తణుకులో శ్రీ సిద్ధేశ్వర స్వామి, కపర్ధీశ్వర స్వామి ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సజ్జాపురం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.

స్వామివారికి విశేష అలంకరణ

ఏలూరులో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నగరంలోని పత్తేబాద శివాలయం, జనార్థన స్వామి ఆలయం, పాత శివాలయం తదితర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారికి విశేష అలంకరణ విశేష అలంకరణలు చేశారు.

గోదావరిలో పుణ్య స్నానాలు..

నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం శ్రీ దుర్గా లక్ష్మనేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు సమీప గోదావరి పుష్కర ఘాట్​లో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.

శైవాలయాల్లో శివరాత్రి శోభ

ఇదీ చదవండి: మనతోనే మహేశ్వరుడు.. విశ్వమంతా విశ్వేశ్వరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.