ETV Bharat / state

Loksabha Secretariat Notice: ఎంపీ రఘురామకు లోక్​సభ సచివాలయం నోటీసులు - Lok Sabha Secretariat sent notices to MP Raghurama

Lok Sabha Secretariat sent notices to MP Raghurama
ఎంపీ రఘురామకు లోక్​సభ సచివాలయం నోటీసులు
author img

By

Published : Jul 15, 2021, 9:18 PM IST

Updated : Jul 15, 2021, 9:48 PM IST

21:14 July 15

ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నుంచి నోటీసులు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై... ముగ్గురు ఎంపీలకు లోక్​సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్​కు నోటీసులు అందాయి.

రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల స్పీకర్‌ను కలిసిన వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి... ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. వాటిని పరిగణలోనికి తీసుకున్న లోక్​సభ సచివాలయం 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

'పిచ్చోడి చేతిలో రాయిలా దేశద్రోహ చట్టం!'

Last Updated : Jul 15, 2021, 9:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.