ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తమైన అధికారులు - corona in westgodaweri

పశ్చిమగోదావరి జిల్లాలో గత పది రోజుల నుంచి భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను ఎంపిక చేసి పూర్తిస్థాయిలో లాక్​డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jun 22, 2020, 12:07 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అధికారులు ఏడు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాలను ఎంపికచేసి ప్రజల రాకపోకలు నిషేధించారు. ఏలూరు నగరంలో ఒకటో పట్టణాన్ని పూర్తిగా లాక్​డౌన్​లోకి తీసుకొచ్చారు. ఏలూరు నగరంలో దాదాపు 216 కేసులు నమోదయ్యాయి.

ఒకటో పట్టణం నుంచి వెళ్లే అన్ని రహదారులను పోలీసులు భారీకేడ్లతో మూసివేశారు. వాణిజ్య దుకాణాలు, వ్యాపార సంస్థలు, కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు బంద్ చేయంచారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, పోడూరు ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల్లో 400 కేసులు నమోదయ్యాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 550కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.