పశ్చిమగోదావరి జిల్లా.. పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏలూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత.. రహదారులను పోలీసులు దిగ్బంధం చేస్తున్నారు. వాహనాలు ఎక్కడివక్కడే నిలిపివేస్తున్నారు. జిల్లాలో కొవిడ్ ఉధృతి అధికంగా ఉండటం వల్ల.. లాక్డౌన్ అమలు చేపట్టారు. జిల్లాలో మూడువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: నకిలీ బంగారం తనఖా పెట్టి రూ.40 లక్షలు స్వాహా