పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ఓ శ్మశానంలో కరోనా మృత దేహాలను పూడ్చి పెడుతున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు. గణేష్ కాలనీలో ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ 2 రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆ మృతదేహాన్ని సమీప శ్మశాన వాటిక వద్ద రాత్రి పూడ్చడంతో స్థానికులు నిరసన తెలిపారు. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించేశారు.
ఇదీ చూడండి..