పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మద్యం దుకాణం నుంచి ఈ మందును అక్రమంగా రవాణా చేస్తుంటే పట్టుకున్నట్లు జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు. 84 సీసాలతోపాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి తెదేపా కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి