పశ్చిమగోదావరిజిల్లాలో ఎలాంటి అనుమతులులేకుండా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయని వామపక్ష నేతలు ఆరోపించారు. రోగుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేప్టటాయి. కొవిడ్ రోగులను భయపెట్టి.. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే కొవిడ్ ఆస్పత్రులను నిర్విహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాంటి ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేయాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: 'సీనియారిటీ జాబితా ఖరారు చేయండి.. పదోన్నతులు ఇవ్వండి'