పునర్విభజన అనంతరం ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు అవసరమైన పదెకరాల భూమిని విరాళంగా ఇస్తానని ఏఎస్‌ఆర్ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు, వైకాపా నాయకుడు గాదిరాజు సుబ్బరాజు ప్రకటించారు. భీమవరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరం సమీపాన కాళ్ల మండలంలో ఉన్న సీసలి గ్రామంలో రూ.15 కోట్ల విలువైన 10 ఎకరాలను స్వచ్ఛందంగా ఇస్తానన్నారు. ఆ స్థలాన్ని మెరక చేసేందుకు సహకరిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం కోరిన వెంటనే స్థలాన్ని రాసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రూ.10 కోట్లు బకాయిలు చెల్లించలేదని ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ తొలగింపు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!