వందా కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ వినియోగదారుడికి షాక్ కొట్టింది. చేసేదేమీ లేక బిల్లు పట్టుకొని విద్యుత్ శాఖ అధికారుల వద్దకు పరుగులు తీశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంకు చెందిన కానూరి లింగాచారి వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ పని చేస్తేనే అతని కుటుంబం పొట్ట నింపుకునే దుస్థితి. కరోనా కష్టకాలంలో అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా.. లక్షల్లో వచ్చిన కరెంట్ బిల్లు చూసి అయోమయానికి గురయ్యాడు. ప్రతి నెలా రు.2వేల లోపు వచ్చే విద్యుత్ బిల్లు.. జూలై చివరిలో ఏకంగా రూ.6,74,900 బిల్లు రావడంతో ఖంగుతిన్నాడు. వెంటనే విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీయగా.. అధికారులు అతని ఇంటికి వెళ్లి మీటర్‌ను పరిశీలించారు.
విద్యుత్ ఏఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. మీటర్లో సాంకేతికలోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని తెలిపారు. వెంటనే మీటర్ మార్చి కొత్త మీటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ.. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: భాజపా