పశ్చిమ గోదావరి జిల్లాలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్‌రావు పర్యటించారు. కేరళ మంత్రి ప్రసాద్‌రావుకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. పెదవేగి మండలం అమ్మపాలెం వ్యవసాయ క్షేత్రాలను ప్రసాద్‌రావు పరిశీలించారు. అమ్మపాలెం, ముండురు, తడికలపుడి, తాడిచేర్ల గ్రామాల్లో వివిధ పంటలను పరిశీలించారు. వరి, కొబ్బరి, ఆయిల్ ఫామ్, కోకో పంటలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. రైతులతో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. ప్రసాద్‌రావు వెంట కేరళ వ్యవసాయశాఖ అధికారుల బృందం వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు మంత్రి బృందానికి సాగు వివరాలు వెల్లడించారు.
'ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి ఏడు మంది బృందంతో ఇక్కడికి వచ్చాం. మాకు మంచి అనుభవం లభించింది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. వారి అనుభవాలు విని మాకు సంతోషం కలిగింది. వరి, ఆయిల్ పామ్, కొబ్బరి పంటల్లో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారో మేము తెలుసుకోవాల్సి ఉంది. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మా రాష్ట్రంలోనూ ఇలాంటి పద్ధతులు అనుసరిస్తాం' -కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్‌రావు
ఇదీ చదవండి: