పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కళాపరిషత్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్నసినీ గేయ రచయిత అనంత శ్రీ రామ్ పాలకొల్లు నుంచి ఎంతో మంది సినీ జగత్తులో ధృవతారలుగా వెలిగారన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. తనకు చేసిన సత్కారంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు శ్రీరామ్. కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ హాజరయ్యారు. అనంతరం నాటిక ప్రదర్శన నిర్వహించారు.
ఇది కూడా చదవండి.