ETV Bharat / state

Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా' - AP Latest News

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అమూల్(Amul) ద్వారా పాల సేకరణను మరింత విస్తరించి, పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని సీఎం జగన్(CM Jagan) స్పష్టం చేశారు. ఈ ఏడాది 2600 గ్రామాల్లో విస్తరిస్తామని, దశలవారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్​ను విస్తరిస్తామని తెలిపారు. అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు. అమూల్​కు పాలు పోయడం లాభదాయకమన్న సీఎం... పాడి రైతులకు లీటర్ కు 5 నుంచి 15 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు. పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న సీఎం.. రాబోయే 2 సంవత్సరాల్లో అక్షరాల 4వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పాల నాణ్యత తెలుసుకునే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
author img

By

Published : Jun 4, 2021, 5:25 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

పశ్చిమగోదావరి జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్ పాల సేకరణను ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా దీన్ని సీఎం ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, అమూల్ ఎండీ ఆర్.ఎస్. సోది, పశ్చిమగోదావరి జిల్లా సహా పలు జిల్లాల నుంచి మహిళలు వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ ఇవాళ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాడి రైతుల కష్టాలు తెలుసుకున్నానన్న సీఎం... లీటర్ పాల కంటే, లీటర్ మినరల్ వాటర్ రేటు ఎక్కువుందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

రైతుకు వ్యవసాయంతోపాటు... వ్యవసాయ ఆధారిత రంగాల్లోనూ అవకాశం రావాలని, అప్పుడే విలేజ్ ఎకానమీ నిలబడగలుగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్​ను తీసుకువచ్చామన్నారు. దేశంలోని సహకార రంగాల్లో అమూల్ నెంబర్ వన్​గా ఉందని, 53 వేల కోట్ల టర్నోవర్ చేస్తోందని వివరించారు. ప్రపంచంలో అమూల్ సంస్థ 8వ స్థానంలో ఉందని, ప్రపంచంతోనే అమూల్ పోటీ పడుతోందని పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే చాలా ఎక్కువ ధర ఇచ్చి అమూల్ పాలు సేకరిస్తోందని సీఎం తెలిపారు.

అమూల్‌కు లాభాపేక్ష లేదన్న సీఎం జగన్.. లాభాలన్నింటినీ అక్కచెల్లెమ్మలకు తిరిగి ఇచ్చే ప్రక్రియ అమూల్​లోనే ఉందన్నారు. సహకార సంస్థ బాగా నడిపితే ఎలా ఉంటుందనేదానికి అమూల్ నిదర్శనమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సహకారం రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు తీసుకోకపోతే ఎలా బలపడుతుందో చెప్పడానికి అమూల్ మంచి నిదర్శనమన్నారు.

2020 డిసెంబర్​లో అమూల్ పాల వెల్లువ ప్రారంభించామన్న సీఎం జగన్.. ఇప్పటివరకు చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 722 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోందన్నారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో 153 గ్రామాల్ల పాల సేకరణ ప్రారంభింస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది 2600 గ్రామాల్లో, దశలవారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్​ను విస్తరిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు.

ప్రతి అక్క, చెల్లెమ్మలకు లీటర్ పాలకు 5 నుంచి 15 రూపాయలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని జగన్ తెలిపారు. 13 వేల 739 మంది మహిళా రైతుల వద్ద 52 లక్షల 93 వేల లీటర్లను అమూల్ సేకరించిందన్నారు. ఇప్పటివరకూ పాల సేకరణకింద చేసిన చెల్లింపుల్లో రూ.24,54 కోట్ల రూపాయల్లో రూ.4.6కోట్లు అదనంగా వచ్చిందని... తద్వారా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మంచి జరిగిందన్నారు జగన్. పాలుపోసే అక్కచెల్లెమ్మలే అమూల్ సంస్థ వాటాదారులన్న సీఎం.. సహకార సంస్థ బలంగా ఉంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు.

ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి రావడంతో గతంలో సహాకారం రంగం మూతపడిందన్న సీఎం జగన్..గతంలో రాష్ట్రంలో సహకార వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పాలు పోసేటప్పుడే నాణ్యత ఇంతకు ముందు తెలిసేది కాదని.. తద్వారా పాలకు తక్కువ ధర వచ్చేదన్నారు.

2600 గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు తీసుకువస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో 4 వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెట్టి 9899 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాట్లు చేస్తుందన్నారు. వీటి ఏర్పాటు వల్ల పాల నాణ్యత, వెన్న శాతాన్ని అక్కడికక్కడే తెలుసుకోవచ్చని, తద్వారా దోపిడీ జరగకుండా, మోసపోకుండా పాలకు మంచి ధర వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమన్న సీఎం... అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చామని, కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో సగం పదవులు మహిళలకే ఇచ్చేలా చట్టం తెచ్చామన్నారు ముఖ్యమంత్రి జగన్. చేయూత ద్వారా మహిళలకు 75 వేలు డబ్బు ఇస్తున్నామని, వీటి ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పెద్ద సంస్థలతో టైయప్ అయ్యి... మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 1.12 లక్షల యూనిట్లు ఆవులు, గేదెల యూనిట్లు కొనుగోలు చేసి ఇచ్చామన్నారు.

గ్రామీణాబివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అమూల్ ఎండీ ఆర్.ఎస్.సోది పేర్కొన్నారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ రైతులు అదృష్టవంతులని వ్యాఖ్యానించారు. రైతుల భాగస్వామ్యంతోనే అమూల్ సంస్థ నడుస్తుందన్న ఆయన.. అమూల్​కు వచ్చే ఆదాయాన్ని రైతులకే అందిస్తుందన్నారు. అమూల్‌ సహకార రంగ సంస్థ ద్వారా రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరుగుతుంది. ఈదిశగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

ఇదీ చదవండీ... Anandayya medicine: ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం తుది ఆదేశాలు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.