పశ్చిమ గోదావరి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహా లక్ష్మి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారిని 9 లక్షలు విలువైన 2000, 500 కొత్త కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు.
కరోనా నిభందనలకు అనుగుణంగా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కుంకుమ పూజలను నిర్వహించారు . సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ... పూజారులు అమ్మవారికి , వేద మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండీ...వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం