ETV Bharat / state

ఆసుపత్రి విస్తరణపై తెదేపా,వైకాపా ల మాటల తూటాలు - ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా

పశ్చిమగోదావరి జిల్లా తణుకు వేల్పూరులో కేంద్ర నిధులతో చేపడుతున్న ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులు నిలిచిపోవటంపై తెదేపా,వైకాపా నేతల మద్య మాటల యుద్దం మొదలైంది.

ఆసుపత్రి విస్తరణపై తెదేపా,వైకాపాల మాటల తూటాలు
author img

By

Published : Sep 8, 2019, 10:23 AM IST

ఆసుపత్రి విస్తరణపై తెదేపా,వైకాపాల మాటల తూటాలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు నిలిచిపోవటంతో తెదేపా, వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వేల్పూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మార్చి, అదనపు భవన నిర్మాణం కోసం కేంద్రం మూడు కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మారటంతో ఆ ఆసుపత్రి పనులు నిలిచిపోయాయి. 25 శాతం లోపు జరిగిన పనులను ఆపివేయాలని ఆదేశించడంతో ఈ ఆసుపత్రి విస్తరణ ఆగిపోయింది. దీంతో తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో జరుగుతున్న పనులను నిలిపివేయటం సమంజసం కాదని మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కక్షసాధింపు ధోరణితోనే పనులు ఆపించారని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకులు ఖండించారు. సాంకేతిక కారణాలతో పనులు నిలిపివేశారే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని వారు తెలిపారు.

ఇదీ చదవండి:మరో 20 ఏళ్లు జగనే ముఖ్యమంత్రి: మంత్రి ధర్మాన

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఈ ప్రాంతంలోని టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి వచ్చిన లోకేష్ ఆ తర్వాత అన్న క్యాంటీన్ ను సందర్శించారు రాష్ట్రంలోని అన్న క్యాంటిన్లు చాలాకాలంగా మూత పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా సందర్శించి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో మాజీ మంత్రి సీనియర్ నాయకులు పాత్రలతో పాటు ఆయన తనయుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.