ETV Bharat / state

అనధికారిక భవన నిర్మాణాల అడ్డుకట్టకు... యూసీఐఎంఎస్‌ ప్రత్యేక యాప్‌ - యూసీఐఎంఎస్‌ యాప్‌ న్యూస్

పశ్చిమ గోదావరి జిల్లాలో అనధికారిక భవన నిర్మాణాలను నియంత్రించేందుకు మున్సిపల్‌ పరిపాలన శాఖ యూసీఐఎంఎస్‌ యాప్‌ను ప్రారంభించింది. కొద్ది నెలలుగా పట్టణాల్లో జరుగుతున్న వ్యక్తిగత, బహుళ అంతస్తుల నిర్మాణాల వివరాలను.. పట్టణ ప్రణాళిక విభాగం ఈ యాప్‌లో నమోదు చేస్తోంది.

illigal-lay-outs-in-eluru-west-godavari-district
అనధికారిక భవన నిర్మాణాల అడ్డుకట్టకు యూసీఐఎంఎస్‌ యాప్‌
author img

By

Published : Feb 11, 2021, 9:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాల్లో అనధికారిక భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు కఠినతరం కావడం, వివిధ కారణాలతో అధిక శాతం ప్రజలు అనధికారిక నిర్మాణాలపై దృష్టి పెడుతున్నారు. నియంత్రించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో అనధికారిక భవనాలు, లేఅవుట్లను నియంత్రించేందుకు మున్సిపల్‌ పరిపాలన శాఖ యూసీఐఎంఎస్‌ (అనాథరైజ్డ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను ప్రారంభించింది. గడచిన కొద్ది నెలలుగా పట్టణాల్లో జరుగుతున్న వ్యక్తిగత, బహుళ అంతస్తుల నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం ఈ యాప్‌లో నమోదు చేస్తోంది.

illigal-lay-outs-in-eluru-west-godavari-district
అనధికారిక భవన నిర్మాణాల అడ్డుకట్టకు యూసీఐఎంఎస్‌ యాప్‌

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అనుమతులులేని నిర్మాణాలు ఫిబ్రవరి నాటికి 3,616 జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా వ్యక్తిగత, బహుళ అంతస్తుల భవనాలున్నాయి. అనధికారిక లేఅవుట్లను పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించి యూసీఐఎంఎస్‌లో నమోదు చేస్తోంది. జిల్లాలో ఇలాంటి 1,391 అనధికారిక లే అవుట్లు గుర్తించారు. ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఈయూడీఏ) పరిధిలోనే 763 అనధికారిక లే అవుట్లు గుర్తించారు. పట్టణ సచివాలయాల్లోని వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులకు అనుమతులు లేని భవనాలను గుర్తించడమే ప్రధాన విధిగా మారింది. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటుందా లేదా అపరాధ రుసుములతో క్రమబద్ధీకరిస్తుందా అన్న అంశం తేలాల్సి ఉంది.

ప్రభుత్వం పరిశీలిస్తోంది.. ‘అనధికారిక భవనాలు, లే అవుట్లను యూసీఐఎంఎస్‌ యాప్‌లో నమోదు చేస్తున్నాం. నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీటి అనుమతులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టణాల్లో ఎటువంటి నిర్మాణం జరిగినా ఈ యాప్‌లో నమోదు చేస్తున్నాం’ అని పట్టణ ప్రణాళిక విభాగం రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామంలో ముగ్గురేసి సర్పంచులు, కార్యదర్శులు, వీఆర్వోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.