పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ఎర్ర కాలువ నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది. ఎటువంటి అధికారిక బిల్లులు లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు అధికారులు దృష్టికి తీసుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎట్టకేలకు ఏలూరు ఎస్ఈబీ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకున్నారు.
బిల్లులు చూపించమని ట్రాక్టర్ డ్రైవర్లను నిలదీయటంతో ముఖం చాటేశారు. డ్రైవర్లను, ట్రాక్టర్లను ఇసుకతో సహా అదుపులోకి తీసుకొని ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి