ETV Bharat / state

పైన కోళ్ల ఎరువు.. లోన 12 లక్షల విలువైన తెలంగాణ మద్యం..

రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీసులు ఎప్పటికప్పుడు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు వక్ర మార్గాల్లో మద్యం తరలిస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద ట్రాక్టర్​లో తరలిస్తున్న కోళ్ల ఎరువు మధ్య 1100 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

illegal alcohol transporting in tractor caught by chintalapudi police
తెలంగాణ మద్యం తరలింపు..
author img

By

Published : Feb 13, 2021, 5:31 PM IST

Updated : Feb 13, 2021, 6:07 PM IST

తెలంగాణ నుంచి చింతలపూడికి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా.. ట్రాక్టర్​లో కోళ్ల పెంట మధ్య ఉంచి 1100 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించారు. మద్యం తరలించే విధానాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ట్రాలీలోని పెంటలో మద్యం తరలిస్తుండగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.

కోళ్ల పెంటలో తెలంగాణ మద్యం తరలింపు

తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్​పై కోళ్ల పెంటను చింతలపూడికి తరలించాలని.. ఆ లోడును గంగారం అడ్డరోడ్డు వద్ద ఎరువు అన్​లోడ్ చేసి తనకు అప్పగించాలని చెప్పినట్లు డ్రైవర్ తెలిపాడు. అందులో మద్యం ఉన్నట్లు తనకు తెలియదని చెప్పడంతో.. అసలు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుకున్న మద్యం సీసాల విలువ సుమారు 12 లక్షల విలువ ఉంటుందని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి: తాడేపల్లిగూడెం ఠాణా వద్ద హిజ్రాల నిరసన

Last Updated : Feb 13, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.