ETV Bharat / state

సూర్యారావుపాలెం పీఏసీఎస్​లో భారీ కుంభకోణం..! - scam in suryaraopalem pacs news

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీ కుంభకోణం జరిగింది. సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర డిపాజిట్ల సొమ్ము మాయం కావడంతో... రైతులు, డిపాజిట్​దారులు ఆందోళనలో ఉన్నారు. తాము డిపాజిట్ చేసిన సొమ్ము... సొసైటీలో, బ్యాంకులో లేదని తెలియడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. ఏడాదిపైగా కాలం నుంచి సొసైటీ చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవట్లేదని రైతులు వాపోయారు. సొమ్ములు స్వాహా అయినట్టు తెలియడంతో తాము కట్టిన డిపాజిట్లను చెల్లించాలని సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలు, మహిళా రైతులు బైఠాయించి ఆందోళన చేశారు.

Huge Scam In Suryarao Plalem PACS
సూర్యారావుపాలెం పీఏసీఎస్​లో భారీ కుంభకోణం
author img

By

Published : Sep 17, 2020, 3:58 PM IST

సూర్యారావుపాలెం సహకార సంఘంలో... దాని పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సొమ్మును డిపాజిట్ చేశారు. గత సంవత్సరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేసే నాటికి సంఘంలో 5 కోట్ల 10 లక్షల రూపాయలు రైతుల డిపాజిట్లు చెల్లించాల్సి ఉండగా.. 89 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంకులో ఉన్నాయి.

తాజాగా చేసిన పరిశీలన ప్రకారం నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలు రైతుల డిపాజిట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంకులో 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. తాము డిపాజిట్ చేసిన సొమ్ములు గల్లంతైనట్లు తెలియటంతో రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలంగా డిపాజిట్లు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

డిపాజిట్ సొమ్ము గల్లంతైనట్లు గుర్తించిన కొత్త పాలక వర్గం.. సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సహకార శాఖ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఆ కమిటీ.. జరిగిన అవకతవకలపై విచారణ చేసింది. నివేదికలను విడుదల చేయాల్సి ఉంది. నివేదికలు వచ్చిన వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు.. డిపాజిటర్లకు న్యాయం చేస్తామని, ప్రతి ఒక్కరికీ అంచెలంచెలుగా డిపాజిట్ సొమ్ము చెల్లించే ఏర్పాటు చేస్తామని పాలకవర్గం చెబుతోంది.

ఇదీ చదవండీ... సమయం చెప్పండి... నేనే వస్తా: ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.