ETV Bharat / state

అందుకే దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి - tanuku home minister press meet

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే దిశ చట్టం రూపకల్పన చేసినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ చట్టం అమలకు హోం శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

home minister press meet in tanuku
'దిశ చట్టంతో ప్రతీ మహిళకు రక్షణ'
author img

By

Published : Dec 15, 2019, 7:35 AM IST

'దిశ చట్టంతో ప్రతీ మహిళకు రక్షణ'
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని హోమంత్రి సుచరిత తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దిశా చట్టాన్ని అమలు చేయటానికి హోంశాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకునే వీలుగా జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాస్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన సిబ్బంది నియామకం, సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష... రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_12_14_HOME_MINISTER_PRESSMEET__AB_AP10092
(. ) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు రక్షణ కల్పించే ఉద్దేశంతో దిశ చట్టం రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Body:దేశంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్ష సరైనదిగా భావించి చట్టంలో పొందుపరిచారని వివరించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందని మంత్రి సుచరిత తెలిపారు.

Conclusion:దిశా చట్టం అమలుకు రాష్ట్రంలో హోంశాఖను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని మంత్రి అంగీకరించారు ప్రయోగశాలలు సిబ్బంది పెంపుదల అవసరం ఉందన్నారు నిందితులపై వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుగా జిల్లాకొక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అందుకు అవసరమైన సిబ్బందిని, ఇతర సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుచరిత వివరించారు
బైట్: మేకపాటి సుచరిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.