ETV Bharat / state

తణుకు ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశాఖ అధికారుల సోదాలు

అనుమతులు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు.

తణుకు
తణుకు
author img

By

Published : Sep 22, 2020, 7:55 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్యశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌లో జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి ధర్మరాజు ఆధ్వర్యంలో అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా.. కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో అన్నివిభాగాలను పరిశీలించిన అధికారులు రోగులను విచారించారు. ఏ వ్యాధితో ఆసుపత్రితో చేరారు... తదితర వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా లక్షణాలతో ఉన్న రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు గుర్తించారు. వారికి పాజిటివ్ ‌లేదా నెగెటివ్ నిర్ధరణ కావాల్సి ఉందన్నారు. ఆసుపత్రిలో గుర్తించిన వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో ధర్మరాజు వెల్లడించారు.

ఇదీ చూడండి. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.