ETV Bharat / state

క్వారంటైన్ కు వెళ్తేనే ఆంధ్రాలోకి అనుమతి!

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం రాష్ట్ర సరిహద్దు వద్ద.. క్వారంటైన్ కు వెళ్లేందుకు అంగీకరించేవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ నిబంధనతో అక్కడి నుంచి చాలా మంది వెనుదిరుగుతున్నారు.

andhra pradesh
క్వారంటైన్ కు వెళ్తేనే ఆంధ్రలోకి
author img

By

Published : May 9, 2020, 11:46 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజవర్గం జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద క్వారంటైన్ కు వెళ్లే వారిని మాత్రమే ఆంధ్రాలో కి అనుమతిస్తున్నారు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నిబంధనతో జీలుగుమిల్లి సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వస్తున్న వందలాదిమంది ఈ నిబంధనతో వెనుదిరిగారు.

తెలంగాణ ఉన్నతాధికారుల అనుమతి పత్రం ఉన్నప్పటికీ ఆంధ్రాలోకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాలని తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్న కారణంగా.. వారంతా వెనక్కి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఆ రాష్ట్ర డీజీపీ అనుమతితో రాష్ట్రంలో అనుమతించిన ఆంధ్రా పోలీసులు ఆ తర్వాత వచ్చిన ఆదేశాలతో నిరాకరించారు.

సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలివచ్చిన వారంతా ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు అనుమతితో వచ్చిన తమను క్వారంటైన్ పేరుతో అడ్డుకోవడం బాధాకరమని వాపోయారు. జీలుగుమిల్లి ఎస్ఐ విశ్వనాథ బాబు, ఆక్టోపస్ ఎస్సైలు దుర్గారావు, చెన్నకేశవులు రాష్ట్ర సరిహద్దు లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాకే పంపించారు.

ఇదీ చదవండి:

జిల్లాలో తాజాగా మరో 9 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.