గులాబ్ తుపాను ప్రభావం(gulab cyclone effect) అధికంగానే ఉంది. నష్టం మరింత(gulab effect on crops) పెరిగింది. మొత్తం 1.91 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల(Agricultural and horticultural crops damaged by gulab)కు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ పశ్చిమగోదావరి జిల్లాలో నీట మునిగిన వరిని పరిశీలించారు.
- మొత్తం 1,29,504 ఎకరాల్లో వరి నీట మునిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో 49వేల ఎకరాలు, విజయనగరం జిల్లాలో 21,997, శ్రీకాకుళం జిల్లాలో 20,162, విశాఖపట్నం జిల్లాలో 17,668, తూర్పుగోదావరి జిల్లాలో 15,610, కృష్ణా జిల్లాలో 5,050 ఎకరాల మేర పంట నీట మునిగింది.
- మొత్తం 27,683 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతినగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనే 27వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో 11,313 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 5వేలు, శ్రీకాకుళం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.మినుము పైరు కృష్ణా జిల్లాలో 4,520 ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 240 ఎకరాల మేర నీట మునగడంతో రైతులు నష్టపోయారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,500 ఎకరాల మేర చెరకుకు నష్టం వాటిల్లింది. వేరుసెనగ, పెసర, పొగాకు, రాగి, రాజ్మా తదితర పంటలూ దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 3,500 ఎకరాలకు పైగా అరటి తోటలు తుపాను ధాటికి నేలకొరిగాయి. వందల్లో కొబ్బరిచెట్లు పడిపోయాయి. కృష్ణా జిల్లాలో సుమారు రెండు వేల ఎకరాల్లో మిరపలో నీరు నిలిచింది. 500 ఎకరాల్లో బొప్పాయితో పాటు అన్ని జిల్లాల్లోనూ 1,200 ఎకరాల మేర కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి..