ETV Bharat / state

ద్వారకా తిరుమలలో ద్వాదశాక్షరీ మంత్ర జపం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ యజ్ఞశాలలో ద్వాదశాక్షరీ మంత్ర జపం, మహా శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో క్షేత్ర పరిసరాల్లో ఆధ్యాత్మికత శోభిల్లింది.

west godavari district
ద్వారకా తిరుమలలో శోభయనంగా ద్వాదశాక్షరీ మంత్ర జపం
author img

By

Published : Jun 16, 2020, 4:55 PM IST

Updated : Jun 16, 2020, 5:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని యజ్ఞశాలలో ద్వాదశాక్షరీ మంత్ర జపం, మహా శాంతి హోమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ యజ్ఞాన్ని ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్​రావు నేతృత్వంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ ,పుణ్యాహవచనం అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో జరిపారు. ఆ తరువాత అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. లోకకల్యాణార్థం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రభాకర్​రావు పేర్కొన్నారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ద్వాదశాక్షరీ మహా మంత్ర జప యజ్ఞాన్ని, మహా శాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి నివారణార్థం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఈవో తెలిపారు.

ఇది చదవండి మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ

Last Updated : Jun 16, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.