పశ్చిమగోదావరి జిల్లా ఆచంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు సుజాత (సీనియర్ అసిస్టెంట్) బీమవరం ప్రాంతానికి సంబంధించిన సర్వే నంబర్లు 579/2, 583/ఎకు అదనంగా ‘ఎ’ అక్షరాన్ని తగిలించి రిజిస్ట్రేషన్ చేశారు. ‘ఎనీవేర్’ విధానంలో భీమవరం ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దస్తావేజుల సమాచారాన్ని ఆమె భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలియచేశారు. అయితే.. ఆ భూముల సర్వే నెంబర్లు నిషిద్ధ జాబితాలో ఉన్నాయని అక్కడి సిబ్బంది పేర్కొంటూ తిరుగు సమాధానం పంపారు. అయినా ఆమె సర్వే నెంబర్లకు అదనంగా ‘ఎ’ చేర్చి రిజిస్ట్రేషన్ చేసేశారు. స్టాంపు, రిజిస్ట్రేషన్ డ్యూటీని సైతం తగ్గించారు. 2020 డిసెంబరులో ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇలాంటివి రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా జరిగినట్లు సమాచారం
మార్కెట్ విలువ తగ్గించేసి...!
కొవ్వూరులో 2.6 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో (2019లో)మార్కెట్ విలువను అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి తగ్గించారు. రూ.4.78 కోట్లకు గానూ రూ.1.25 కోట్లకు మార్కెట్ విలువ తగ్గించి రిజిస్ట్రేషన్ చేయడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.26 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోనికి రావడంతో ప్రస్తుతం పరిపాలనా విభాగంలో పనిచేస్తోన్న ఆమెను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనల కంటే ముందుగా నరసాపురం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్ నిషిద్ధ భూమి వ్యవహారంలో కోర్టు అటాచ్‌మెంట్ ఉత్తర్వులు ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ ఇలాగే సస్పెండ్ అయ్యారు.
16 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్!
మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు సత్యనారాయణ రిజిస్ట్రేషన్ల నిషిద్ధ జాబితాలో ఉన్న కుమ్మరపురుగుపాలెం గ్రామానికి చెందిన అసైన్డ్ భూమికి సంబంధించి 16 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేశారు. సర్వే నంబరు ఆర్.ఎస్.నెం.123/2 ఉండగా ఆర్.ఎస్.నంబరు 123/2ఎగా మార్చేసి, 16 ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏలూరు అధికారులు తెలిపారు. 2016లో జిల్లా కలెక్టర్ ప్రకటించిన నిషిద్ధ జాబితాలో ఈ భూములు ఉన్నాయి.
ఇదీచదవండి.