పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలోని తన నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత 12గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు రూ. 5వేలు ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మూసివేసిన అన్నా కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పార్టీ అనుచరులతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.
ఇదీ చూడండి: