Flood Problems: గోదావరి వరద తగ్గుముఖం పట్టినా.. కొన్ని లంక గ్రామాలకు పాట్లు తప్పటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్‌వే.. ఇంకా ముంపులోనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 8లక్షల 58 వేల 213 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడిచిపెడుతుండగా.. ఇది 5లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ కాజ్‌వే బయటపడదని స్థానికులు తెలిపారు. ప్రస్తుతానికి కాజ్‌వేపై రాకపోకలకు వీల్లేకపోవడంతో.. పడవలనే వినియోగిస్తున్నారు. గోదావరి మధ్యలో ఉన్న బూరుగులంక, ఊడిముడి లంక, జి.పెదపూడిలంక, అయోధ్యలంక, అరిగెలవారిపేట, ఆనగారిలంక, పెదమల్లంక ప్రజలు పడవలనే వినియోగిస్తున్నారు.
అందని సాయం: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చోడవరంలో వరద సాయం అందలేదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గోదావరి వదలో.. ముంపునకు గురైన తమను పలకరించే వారే లేరని వాపోయారు. 48 గంటల్లోగా ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి 2 వేల రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందంటూ మండిపడ్డారు. ముంపు బాధితులకు స్థానిక తెదేపా నేతలు మద్దతు తెలిపారు.
ఇవీ చూడండి