ETV Bharat / state

ఐదేళ్ల చిన్నారి రిషిత ప్రతిభ.. లింబో ఫైర్ స్కేటింగ్​లో ప్రపంచ రికార్డు - తణకులో ఐదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు

ఆ బాలిక వయసు ఐదేళ్లు .. ఆ వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటారు. కానీ ఆ చిన్నారి రూటే సెపరేటు. ఏకంగా ప్రపంచ రికార్డునే కొల్లగొట్టింది. కేవలం ఎనిమిది అంగుళాల ఎత్తులో మంటలు చెలరేగుతుంటే వాటికింది నుంచి 20 మీటర్ల పొడవు స్కేటింగ్ చేసి చూపరులనే కాదు.. 12 దేశాల వజ్ర సంస్థ ప్రతినిధులనూ ఔరా అనిపించింది.

record
ఐదేళ్ల చిన్నారి రిషిత ప్రతిభ.. లింబో ఫైర్ స్కేటింగ్​లో ప్రపంచ రికార్డు..
author img

By

Published : Feb 23, 2021, 10:28 PM IST

ఐదేళ్ల చిన్నారి రిషిత ప్రతిభ.. లింబో ఫైర్ స్కేటింగ్​లో ప్రపంచ రికార్డు..

లింబో ఫైర్ స్కేటింగ్​లో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఐదేళ్ల బాలిక రిషిత ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తణకులో నిర్వహించిన ఫైర్ స్కేటింగ్​లో ఈ ఘనత సాధించింది. వజ్ర వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమె ప్రతిభను స్వయంగా పరిశీలించి రికార్డు నమోదు చేశారు.

ఎనిమిది అంగుళాల ఎత్తులో మంటల కిందనుంచి 20 మీటర్ల పొడవున స్కేటింగ్ చేసి రికార్డు సాధించింది. ఏడాదిన్నరగా స్థానికంగా ఉన్న కోచ్ వద్ద శిక్షణ పొందుతున్న రిషిత తన ప్రతిభను నిరూపించుకుంది. గతంలో లింబో ఫైర్​ స్కేటింగ్​లో ఇటువంటి రికార్డు నెలకొల్పడం ఇదే ప్రథమమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రికార్డు సాధించిన రిషితను సంస్థ ప్రతినిధులు సత్కరించి ధ్రువపత్రం, మెడల్, జ్ఞాపిక బహుకరించారు. రిషితను పలువురు అభినందించారు.

ఇదీ చదవండి: ఐటీ విభాగంలో ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయస్థాయి అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.