వేసవిలో చేపల వేట సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన జీవన భృతిని ఇంతవరకూ చెల్లించలేదని పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకారులు వాపోతున్నారు. వేటకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి తమదని ...ప్రభుత్వం ఇంతవరకూ భృతిని చెల్లించకపోవటం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 19 కిలోమీటర్ల పరిధిలో తీరం విస్తరించి ఉంది. 9 గ్రామాల్లో సుమారు లక్షా 20 వేలకు పైగా మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన 72 మోటర్ బోట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కాక 138 సంప్రదాయక బోట్లలో 3 వేల కుటుంబాలు ఐలా వలలతో వేట సాగిస్తున్నారు. వీరంతా వేసవిలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించటంతో ఉపాధి కోల్పోతున్నారు. అయితే ప్రభుత్వం చెల్లించాల్సిన భృతి సకాలంలో అందక పూట గడవటం కష్టంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భృతిని త్వరగా అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. గుర్తింపు పొందిన వారికే కాకుండా చేపల వేటపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ జీవన భృతి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి-జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్ లేక చనిపోయాడు