పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడులో మనస్థాపంతో ఆకుల వెంకటరత్నం(70) అనే వృద్ధుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్ళ క్రితం భార్య చనిపోగా.. ఆయన కొడుకు వద్దే ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఇంట్లో తండ్రి కుమారుల మధ్య జరిగిన ఘర్షణలో మనస్థాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: