లాక్ డౌన్ వల్ల నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వివిధ రైతు సంఘాలకు చెందిన నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. లాక్ డౌన్ లో దెబ్బతిన్న రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు వినతిపత్రం అందించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని, రుణ మాఫీ చేపట్టాలని, రైతు భరోసా సాయాన్ని పెంచాలని, మద్దతు ధర కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: భక్తులు ఇచ్చిన బంగారం కరిగిస్తే తప్పేముంది?: మంత్రి వెల్లంపల్లి