పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ భూపతి రాజు, సత్యనారాయణ రాజు, వీరవల్లి రమేష్‌లు సంయుక్త ఆధ్వర్యంలో కొండేపూడి, వేండ్ర, వేండ్ర అగ్రహారం గ్రామాల్లోని ప్రజలకు పది టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు. విస్సాకోడేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గ్రామంలోని 3,220 కుటుంబాలకు 15 టన్నుల కూరగాయలను ఇంటింటికీ అందించారు. బంగాళాదుంపలు, క్యారెట్ ,క్యాబేజీ, బెండ వంటి రకాలను ప్యాక్ చేసి ఇంటింటికి పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: