మూడు రాజధానులు బిల్లును ఆమోదించడం ద్వారా గవర్నర్ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇస్తే వారి త్యాగాలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉండేందుకు సమ్మతి తెలిపారని గుర్తిచేశారు. మాట తప్పను మడమ తిప్పనంటూ అధికారంలోకి వచ్చాక అమరావతిని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
జగన్ ఎందుకు మాట మారుస్తున్నారు: గొల్లపల్లి సూర్యరావు
కొందరు స్వార్థపరులు రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యరావు ధ్వజమెత్తారు. భూములిచ్చిన రైతులు, ఆడబిడ్డల ఘోష, ఆర్తనాదాలు వారికి వినబడడం లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం చేసే తప్పులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తోందంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేనివారు తెదేపాను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న జగన్.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారంటూ నిలదీశారు.
ఇవీ చదవండి..