ETV Bharat / state

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు: మాజీ మంత్రి - bjp

ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నందుకే తనపై సోషల్ మీడియాలో వైకాపా అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం స్పందించటం లేదని మండిపడ్డారు.

భాజపా
author img

By

Published : Aug 28, 2019, 5:31 PM IST

మీడియా సమావేశంలో మాణిక్యాలరావు

సోషల్ మీడియాలో తనపై వచ్చిన అసత్య ప్రచారాలపై మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఘాటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాజపా క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. తన చిత్రాలను మార్ఫింగ్ చేసి శ్రద్ధాంజలి అని, ప్రమాదంలో మృతి అని దుష్ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.

హిందూ దేవాలయాల భూములు, నిధులను అనుచర గణానికి పంచిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని మాణిక్యాలరావు ఆరోపించారు. దేవాదాయ భూములపై మాట్లాడుతున్న ప్రభుత్వం... రాష్ట్రంలోని వేలాది ఎకరాల క్రైస్తవ భూములపై ఎందుకు నోరు ఎత్తటం లేదని నిలదీశారు. ప్రభుత్వ తప్పిదాలను లెవనెత్తితే తనపై వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు. తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుందని విమర్శించారు. ఈ చర్యలన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
దేవాలయ భూములపై ప్రభుత్వాలకు హక్కు లేదన్నారు. హిందూ ఆలయ ఆస్తులతో పాటు అమరావతి నిర్మాణంపై ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వం వీటిపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్ర విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని హెచ్చరించారు.

Intro:ap_gnt_51_1lbooth_no167start_kani_poling_c16 ఉదయం ఏడు గంటలకు కు ప్రారంభం కావలసిన న పోలింగ్ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన గ్రామం లోని 167 బూత్ లో మధ్యాహ్నం 11 గంటలు అవుతున్న ప్రారంభం కాలేదు దీంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు

Body:ఈ గ్రామం మం మండలంలోనే అత్యంత సమస్యాత్మక గ్రామం కావడంతో ఇరుపార్టీలు ఆందోళన చెందుతున్నాయి ఇదేవిధంగా వర్గం లోని పొన్నూరు మండలం సీతారాంపురం అదేవిధంగా పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల లో అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా వి.వి పాట్లు వెంటనే మొరాయిస్తున్నాయి దీంతో చేసేది లేక అధికారులు మరో వివి పాటలను అమరుస్తున్నారు కారణంగా ఓటింగ్ ఆలస్యమవుతుందని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.