పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న... 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఏలూరు సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల, తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీవాసవి పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల జుట్టు మూడు ఓవర్లకే నిర్ణిత పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది.
రెండో మ్యాచ్లో చైతన్య జూనియర్ కళాశాల, తాడేపల్లిగూడెంకు చెందిన విజిట్ పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. విజిట్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు మ్యాచ్కు నిర్ణీత సమయంలో హాజరు కానందున చైతన్య కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి జరిగిన మూడో మ్యాచ్లో నల్లజర్లకు చెందిన ఏకేఆర్జీ ఇంజినీరింగ్ కళాశాల, ఏకేఆర్జీ డిగ్రీ కళాశాల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఏకేఆర్జీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.
ఇదీ చూడండి: ఏలూరులో నాలుగో రోజు క్రికెట్ పోటీలు