పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కిరాణ మర్చంట్ అసోసియేషన్ భవనంలో వరద బాధితులకు దుప్పట్లు, స్టీల్ కంచాలు అందించామని నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి తెలిపారు.
వివేకా స్ఫూర్తితో..
శ్రీ స్వామి వివేకానంద సేవాసమితి, వీవీఎస్ గార్డెన్స్ అధినేత వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. ఆపదలో ఉన్నవారికి స్వామీ వివేకానంద స్ఫూర్తితో శివ వర్మ సమితి ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెరుకువాడ వెంకట్రామయ్య కొనియాడారు.
సేవా సమితి ద్వారా..
లాక్డౌన్ సమయంలో 20 మంచాలు, 300 దుప్పట్లు, కంచాలు సేవా సమితి ద్వారా అందించారని గుర్తు చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవీ చూడండి : ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల