పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల మైదానంలో దిశ చట్టంపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేలా దిశ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం వల్ల అమ్మాయిలపై అఘాయిత్యాలకు ఒడిగట్టే మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతుందని స్పష్టం చేశారు.
మహిళా మిత్రల ఏర్పాటుకు చర్యలు
మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి గ్రామ, వార్డు స్థాయిలో మహిళా మిత్రలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 నెంబర్కు ఫోన్ చేసిన ఏడు నుంచి పది నిమిషాల్లో తన సిబ్బంది అక్కడికి చేరుకుంటారన్నారు . వార్షిక తనిఖీల్లో భాగంగా దెందులూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన.. స్టేషన్లో దస్త్రాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: