పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పసుపులేటి రాధాకృష్ణ తన కుమార్తెకు జ్వరం రావడంతో పట్నంలో వైద్యుని సంప్రదించారు. డాక్టర్ సూచన మేరకు తణుకులోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు చేయించారు. పరీక్షల్లో రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వచ్చింది. అనుమానంతో రాధాకృష్ణ వేరే వైద్యుని సంప్రదించారు. రెండో వైద్యుని సలహాతో అవే రక్త పరీక్షలు చేయించగా రక్తకణాలు సరిగానే ఉన్నాయని తేలింది. లేబరేటరీ నిర్వాహకంపై బాధితుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి నివేదికలో తేడాలున్నట్టు తేల్చారు. ల్యాబోరేటరినీ 6 నెలలపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి.