బలహీనంగా ఉన్న గోదావరి గట్టులను గుర్తించి యుద్ద ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. గట్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో ముంపు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు.
వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆళ్ల నాని సూచించారు. పాతపోలవరం ప్రజలతో ఆయన మాట్లాడారు. ఎటువంటి భయాందోళన చెందవద్దని... ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి