పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మహిళను తీసుకువచ్చి ఇంట్లో పూజలు నిర్వహిస్తుండగా.. గ్రామస్థులు పట్టుకుని మహిళకు దేహశుద్ధి చేశారు. తమ గ్రామంలో క్షుద్రపూజలు ఎందుకు చేస్తున్నావంటూ ప్రశ్నించారు. పూజలు నిర్వహించిన మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఒక దశలో పోలీసులకు, గ్రామస్థులకు వాగ్వివాదం జరిగింది. పూజలు నిర్వహిస్తున్న మహిళ కొవ్వూరు వాసిగా గుర్తించారు. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి తణుకు నియోజకవర్గంలో సంపూర్ణ లాక్ డౌన్