పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలోని నాయి బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిత్యావసర సరకులు, కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు.
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. వారిని ఆదుకోవడానికి తన వంతు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 200 మందికి సరకులు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి:
వెయ్యి కుటుంబాలకు సరకులు పంచిన ఓఎన్జీసీ