పశ్చిమగోదావరిజిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద అక్రమంగా ఆవులను తరలిస్తున్న ఐషర్ వ్యాన్ బోల్తా పడింది. ప్రమాదంలో సంఘటనా స్థలంలో నాలుగు ఆవులు చనిపోగా మిగతా ఆవులకు తీవ్రగాయాలు అయ్యాయి. చట్టానికి విరుద్దంగా గోవులను గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. స్థానికుల సహాయంతో ఆవులను వ్యాన్ నుంచి బయటకు తీసి రక్షించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీలుగుమిల్లి ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి