పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ యువకుడు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న పాలకొల్లులో వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు అనంతరం అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే స్పందించిన ఆ యువకుని తల్లిదండ్రులు.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించిందని విజయవాడ లేదా ఇతర ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
అయితే మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా... యువకుడికి మెదడులోని నరాలు చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోక ముందు తమ కుమారుడు బాగానే ఉన్నాడని..వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు చెప్పారు.
ఇదీ చదవండి: